హీరోయిన్స్ కోసం అగ్ర హీరోలు!

టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉన్న మాట వాస్తవమే. స్టార్ హీరోలు సైతం తమ సినిమాల్లో హీరోయిన్స్ ను రిపీట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా రెండు పెద్ద ప్రాజెక్ట్స్ కు హీరోయిన్లు దొరకక దర్శకులు తలలు పట్టుకుంటున్నారు. మహేష్ బాబు, మురుగదాస్ సినిమా పూర్తయిన వెంటనే మహేష్, కొరటాల దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే డైలమాలో పడింది చిత్రబృందం.

ఇక్కడ ఉన్న హీరోయిన్లను రిపీట్ చేయలేక బాలీవుడ్ నుండి ఎక్కువ పెట్టుబడి పెట్టి హీరోయిన్లను దింపలేక కొత్తవారికోసం వెతుకులాట మొదలుపెట్టారు. అలానే ప్రభాస్, సుజీత్ దర్శకత్వంలో రాబోయే సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో పడ్డారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ బాషల్లో రిలీజ్ చేయనున్నారు. దీంతో ఖచ్చితంగా బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ ను బరిలోకి దింపడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ అవకాశం ఎవరికి దక్కుతుందో.. చూడాలి. మొత్తానికి స్టార్ హీరోలకి సైతం హీరోయిన్ల బాధలు తప్పడం లేదు!