స్టిక్ పట్టుకొని నడుస్తున్న బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌.. ట్రెండ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కత్రినా కైఫ్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ “భారత్” సినిమాతో నటిస్తోంది. సల్మాన్, అమీర్ కు ఆమె మంచి స్నేహితురాలు. అలాగే భారత్ దర్శకుడు ఆలీ అబ్బాస్ జాఫర్ కు కూడా మంచి స్నేహితురాలే. సల్మాన్..కత్రినా కాంబినేషన్లో వచ్చిన ఏక్ థా టైగర్.. టైగర్ జిందా హై సినిమాలకు ఆలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు భారత్ తో మూడో హిట్ కొట్టాలని చూస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే, ఈ స్టార్ హీరోయిన్ సడెన్ గా స్టిక్ పట్టుకొని కుంటుతూ నడుస్తూ కనిపించింది. బాలీవుడ్ గల్లీబాయ్ ను ప్రత్యేకంగా చూసేందుకు ఆమె వచ్చింది. కాలికి చిన్న గాయం అయినట్టుంది.. స్టిక్ పట్టుకొని నడుస్తుంది. భారత్ దర్శకుడు ఆలీ అబ్బాస్ జాఫర్ ఆమెను పట్టుకొని థియేటర్ కు తీసుకెళ్లాడు. ఈ సందర్భంలో తీసిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.