HomeTelugu Newsజాన్వీ నెక్ట్స్ టాలీవుడ్ మూవీ ఆ హీరోతోనే.. క్లారిటీ ఇచ్చిన బోనీకపూర్

జాన్వీ నెక్ట్స్ టాలీవుడ్ మూవీ ఆ హీరోతోనే.. క్లారిటీ ఇచ్చిన బోనీకపూర్

Boney Kapoor Clarity on Jan

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తరువాత బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతునే ఉంది. ఇప్పటికే ఏ ఆర్ రెహమాన్‌తో ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేశాడని టాక్‌. రెండు పాటలకు కూడా సెట్ అయ్యాయని అంటున్నారు.

మార్చిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించి.. ఏప్రిల్ నుంచి కంటిన్యూగా షూటింగ్ చేస్తారని సమాచారం. అయితే ఈ మూవీలో రామ్ చరణ్‌కు జంటగా ఎవరిని ఫిక్స్ చేయాలనేది బుచ్చిబాబు ఆలోచిస్తున్నాడట. ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించాచి. గతకొంతకాలంగా జాన్వీ పేరు కూడా చక్కర్లు కొడుతుంది. బుచ్చిబాబు కూడా
జాన్వీ కపూర్‌నే అనుకుంటున్నాడట. అయితే వాటిని తాజాగా బోనీ కపూర్ కన్ఫామ్ చేశాడు.

తన కూతురు నెక్ట్స్ రామ్ చరణ్ సినిమాలో నటిస్తోందంటూ చెప్పేశాడు. అయితే ఫ్యాన్స్‌ మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జాన్వీ కపూర్ వద్దు బాబోయ్ అని కామెంట్స్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌కు ఇంత వరకు ఓ హిట్టు రాలేదు. కనీసం స్క్రీన్ మీద నటనను కూడా ప్రదర్శించలేదని నార్త్ ఆడియెన్స్ ఎప్పుడూ ఆమెను ట్రోల్ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే.

జాన్వీ కపూర్‌ ఇప్పటికే టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌ దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే రెండో సినిమానే రామ్‌చరణ్‌తో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఆమెకు మొదటి హిట్టు మన టాలీవుడ్ నుంచే వచ్చేలా ఉంది అంటున్నారు నెటిజన్లు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!