ప్రజావేదిక కూల్చివేతపై పవన్ కల్యాణ్ స్పందన


ఏపీ రాజధాని అమరావతిలోని ప్రజావేదిక భవనం కూల్చివేతపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ప్రజావేదికతో సరిపెట్టకుండా అనుమతిలేని మిగతా భవనాలను కూడా కూల్చివేయాలన్నారు. అనుమతిలేని అన్ని భవనాలను కూలిస్తేనే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం దాదాపు రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రజావేదిక భవనానికి అనుమతులు లేవని అధికారులు కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.

గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయంలో నిర్వహించిన 108 కలశాల పూజలో పవన్‌ కల్యాణ్‌తో పాటు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు.