HomeTelugu Trendingతండ్రి పుట్టిన రోజు సందర్భంగా నారా బ్రాహ్మణి సందేశం..

తండ్రి పుట్టిన రోజు సందర్భంగా నారా బ్రాహ్మణి సందేశం..

9 6
టాలీవుడ్‌ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ‘జూన్‌ 10న’ పుట్టినరోజు జరుపుకోబోతున్న నేపథ్యంలో నారా బ్రహ్మణి అభిమానులకు సందేశం ఇచ్చారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతున్న వీడియోను అభిమానులు సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ‘నాన్న అభిమానులకు నమస్కారం.. మీరు నాన్న 60వ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకొంటున్నారు. అలానే నాన్న వ్యక్తిత్వాన్ని తెలుపుతూ ఎంతో ఆసక్తికరమైన పోస్ట్‌లు చేస్తూ, హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండింగ్‌ చేస్తున్నారు. నేను సోషల్‌మీడియాలో వాటిని చూసి చాలా సంతోషించా. అదేవిధంగా భౌతిక దూరం పాటిస్తూ, బాధ్యతగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు’

‘ఈ ఏడాది మీ ఇంట్లో, మీ కుటుంబ సభ్యులతో నాన్న జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మీరు నిశ్చయించుకోవడం నాకు అన్నింటికంటే గర్వంగా ఉంది. ఎందుకంటే.. ఇది చాలా ముఖ్యమైంది. మనం సురక్షితంగా ఉండాలి.. మన చుట్టూ ఉన్న వాళ్లూ క్షేమంగా ఉండాలి. అభిమానులు ఎప్పుడూ మా కుటుంబ సభ్యులతో సమానం. నాన్నకున్న క్రమశిక్షణ.. అభిమానులకు కూడా రావడం సంతోషించాల్సిన విషయం. ఎల్లప్పుడూ మీ ప్రేమాభిమానాలు మాపై చూపిస్తారని ఆశిస్తున్నా’ అని ఆమె చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!