HomeTelugu Newsనిలిచిపోయిన బన్నీ సినిమా షూటింగ్?

నిలిచిపోయిన బన్నీ సినిమా షూటింగ్?

13 7
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని సైతం కుదిపేస్తోంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా విదేశాల్లో షూటింగ్ అంటే వణికిపోతున్నారు. దాంతో సినిమా షూటింగ్ లను కూడా వాయిదా వేసుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ సినిమాపై ఈ ఎఫెక్ట్ పడింది. ఇటీవల ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్. తన తర్వాతి సినిమా సుకుమార్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా
కనిపించబోతున్నాడు. గంధపు చెక్కల నేపథ్యంలో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

పూర్తిగా మాస్ మసాలాతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ బన్నీ లేకుండానే పూర్తిచేశారు. తర్వాతి షెడ్యూల్ కేరళలోని అడవుల్లో జరగాల్సి ఉంది. కేరళలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో షూటింగ్‌ను వాయిదా వెయ్యాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గితే ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక మందన నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!