HomeTelugu Reviews'C/o కంచరపాలెం' మూవీ రివ్యూ

‘C/o కంచరపాలెం’ మూవీ రివ్యూ

రొటిన్‌ కథలతో తెలుగు ప్రేక్షకులు విసిపోయారు. రియలిస్టిక్‌గా తెరకెక్కిన సినిమానులను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు సినిమాల నుండి హీరోయిజం, యాక్షన్‌ లాంటివే కాకుండా సమాజంలో కనిపించే వ్యక్తిత్వాలనే కథగా తెరకెక్కించే సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకుల అభిరుచికి తగటు వస్తున్న మరో రియలిస్టిక్‌ మూవీ ‘C/o కంచరపాలెం’. కంచెరపాలెం అనే గ్రామంలో అక్కడి ప్రజలతోనే తెరకెక్కించిన ఈ సినిమాను యంగ్ హీరో రానా దగ్గుబాటి తన సమర్పణలో రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో C/o కంచరపాలెం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహించాడు. విజయ ప్రవీణా పరుచూరి నిర్మాతగా తెరకెక్కించిన సినిమా C/o కంచెరపాలెం ఇప్పటికే సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.

5 6

కథ: ఈ చిత్రం కంచర పాలెం అనే ఊరిలో జరిగిన కథ ఆధారంగా రూపొందింది. ఆ ఆ ఊరికి చెందిన రాజు వ్యక్తి (సుబ్బారావు) ఓ అటెండ‌ర్. అతనికి 49 సంవత్సరాలు వచ్చినా.. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మాచారిగానే కాలం గాడిపేస్తుంటాడు. అయితే ఊళ్లో జనం అంతా వ‌య‌సు మీద‌ప‌డినా పెళ్లి చేసుకోలేదంటూ రాజు గురించి ర‌క‌ర‌కాలుగా మాట్లాడుతుంటారు. అదే సమయంలో ఒరిస్సా నుంచి ట్రాన్సఫర్‌ మీద తమ ఆఫీసుకు వచ్చిన ఆఫీసర్‌ రాధ( రాధ బెస్సీ) తో ప్రేమలో పడతాడు. భర్త చనిపోయిన ఆమెకు ఇర‌వ‌య్యేళ్ల కూతురు ఉంటుంది. అదే ఊరికి చెందిన జోసెఫ్ (కార్తీక్ రత్నం), భార్గవి (ప్రణీతా పట్నాయక్)లు మ‌తాలు వేరైనా ఆ ఇద్ద‌రూ అనుకోకుండా ప్రేమ‌లో ప‌డ‌తారు. అదే ఊళ్లో వైన్ షాప్‌లో ప‌నిచేసే గడ్డం (మోహన్ భగత్)కి కూడా ఓ ప్రేమ‌క‌థ ఉంటుంది. సలీమా(విజయ ప్రవీణ) అనే వేశ్య క‌ళ్ల‌ని చూసి ప్రేమిస్తాడు గెడ్డం. సుందరం (కేశవ కర్రి) స్కూల్ పిల్లాడు. తన క్లాస్‌మెట్‌ సునీత (నిత్య శ్రీ) అంటే సుందరానికి చాలా ఇష్టం. స్నేహితుడి సాయంతో ఎలాగైన సునీతతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ నాలుగురి ప్రేమ‌క‌థలు ఎలాంటి మ‌లుపులు తిరిగుతాయి అనేదే కథలోని అంశం.

5a 1

నటీనటులు: ఈ చిత్రంలోని ప్రతి పాత్ర కీలకమైనవే అందరూ కథానాయకులే. ఈ సినిమాలో కంచరపాలెం ఊరికి చెందినవాళ్లే 52 మంది ఇందులో న‌టించారు. ఈ చిత్రంలో ఎవ‌రికీ మేక‌ప్ ఉండ‌దు. నిజ జీవితాల్లో ఎలా క‌నిపిస్తుంటారో, తెర‌పై కూడా అంతే. సినిమా చూసి బ‌య‌టికొచ్చాక ప్ర‌తి చిన్న పాత్ర కూడా గుర్తుండిపోతుంది. న‌టీన‌టులు కొత్త‌వాళ్ల‌యినా పాత్ర‌ల్లో జీవించారు. సుంద‌రం తండ్రి పాత్ర, ఆయ‌న అభిన‌యం ప్రేక్ష‌కుల‌పై ప్ర‌త్యేక‌మైన ప్ర‌భావం చూపుతుంది. వెంక‌టేష్ మ‌హా ఆలోచ‌న‌ల్లోని ప‌రిణ‌తికి అద్దం ప‌డుతుందీ చిత్రం. ఆయ‌న చిత్రాన్ని తెర‌కెక్కించిన విధానం, పాత్ర‌ల్ని ముడిపెట్టిన విధానం చాలా బాగుంది. ఇండిపెండెంట్ సినిమా కాబ‌ట్టి, అందుకు త‌గ్గ‌ట్టుగానే ఉన్నాయి నిర్మాణ విలువ‌లు. నిర్మాత విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి చిత్రంలో స‌లీమా అనే కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ఆమె అభిన‌యం ఎంత బాగుందో, ఈ సినిమా క‌థ‌ని నిర్మించిన ఆమె అభిరుచి అంత‌కంటే గొప్ప‌గా ఉంది.

5b

విశ్లేషణ: కంచరపాలెం అనే ఓ పల్లెటూరిలోని వ్యక్తులు వారి జీవితాలే ఆధారంగా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు వెంకటేష్‌ మహా. సినిమాను పూర్తిగా సహజంగా తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు. ప్ర‌తి జీవితంలోనూ ఓ ఆర్ద్రత ఉంటుంది. దాన్ని ప‌క్కాగా తెర‌పైకి తీసుకురావ‌డం ఇంత సులువా అని ఆశ్చ‌ర్యానికి గురిచేసే చిత్ర‌మిది. ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయో, ఎలా మాట్లాడతాయో అలాగే తెర మీద ఆవిష్కరించాడు దర్శకుడు. అదే సమయంలో సమాజంలో ఉన్న అంతరాలు, కులమత భేదాలు వాటి పర్యవసానాలను మనసును తాకేలా చూపించాడు. అనవసరంగా హాస్య సన్నివేశాలను ఇరికించకుండా.. లీడ్‌ క్యారెక్టర్స్‌ ప్రవర్తన నుంచే కామెడీ పండించి ఆకట్టుకున్నాడు. అందువల్లే ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి కంచరపాలెంలోని పాత్రలతో కాసేపు గడిపిన అనుభూతి కలుగుతుంది. మొదటి భాగంలో పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు నెమ్మదిగా కథ నడిపించాడు. ఈ సినిమాలో న‌వ్వించాలి, ఏడిపించాలి, ప్రేమ పండాలి అంటూ… అందుకోసం ట్రాక్‌లు, క‌మ‌ర్షియ‌ల్ హంగులు జోడించ‌డం తెలుగు సినిమాల్లో చూస్తూనే ఉంటాం. కానీ, ఇక్క‌డ అలాంటి ప్ర‌య‌త్నాలేవీ క‌నిపించ‌వు. ప్ర‌తి పాత్ర న‌వ్విస్తుంది, ఏడిపిస్తుంది, జాలి క‌లిగేలా చేస్తుంది. ప్రతి పాత్ర గురించి వివరించే నేప‌థ్యంలోని స‌న్నివేశాలు హృద‌యాల్ని మెలిపెడ‌తాయి. అస‌లు ఈ క‌థ‌లన్నింటికీ ముగింపు ఎలా అనుకొంటుండ‌గానే ఓ గొప్ప మ‌లుపు. అది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ఆదిత్య జవ్వాడి, వరుణ్‌ ఛాపేకర్ ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. రవితేజ గిరిజిల కూర్పు, నాగార్జున తాళ్ల‌ప‌ల్లి సౌండ్ డిజైనింగ్ బాగా కుదిరాయి. సింక్ సౌండ్‌తో నేరుగా లైవ్ రికార్డింగ్‌గా ఈ సినిమా తీర్చిదిద్దారు. అది మ‌రింత సహజత్వాన్ని తీసుకొచ్చింది. స్వీక‌ర్ అగస్తి సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది.

హైలైట్స్
కథ
నటీ, నటులు
డ్రాబ్యాక్స్
నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే

చివరిగా : ఇది సినిమా కాదు.. జీవితం
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

చిత్రం: కేరాఫ్ కంచ‌ర‌పాలెం
న‌టీన‌టులు: సుబ్బారావు, రాధాబెస్సి, కేశ‌వ క‌ర్రి, నిత్య‌శ్రీ గోరు త‌దిత‌రులు
సంగీతం: స్వీకర్‌ అగ‌స్తి
ద‌ర్శ‌క‌త్వం: వెంకటేశ్ మ‌హా
నిర్మాత‌: విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి
స‌మ‌ర్ప‌ణ‌: ద‌గ్గుపాటి రానా

Recent Articles English

Gallery

Recent Articles Telugu

రొటిన్‌ కథలతో తెలుగు ప్రేక్షకులు విసిపోయారు. రియలిస్టిక్‌గా తెరకెక్కిన సినిమానులను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు సినిమాల నుండి హీరోయిజం, యాక్షన్‌ లాంటివే కాకుండా సమాజంలో కనిపించే వ్యక్తిత్వాలనే కథగా తెరకెక్కించే సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రేక్షకుల అభిరుచికి తగటు వస్తున్న మరో రియలిస్టిక్‌ మూవీ 'C/o కంచరపాలెం'. కంచెరపాలెం అనే గ్రామంలో అక్కడి ప్రజలతోనే తెరకెక్కించిన ఈ సినిమాను యంగ్...'C/o కంచరపాలెం' మూవీ రివ్యూ