HomeTelugu Trendingకెప్టెన్‌ మిల్లర్‌: సెకండ్‌ సింగిల్‌ ప్రోమో

కెప్టెన్‌ మిల్లర్‌: సెకండ్‌ సింగిల్‌ ప్రోమో

captain millar second singl
కోలీవుడ్ స్టార్‌ హీరో ధ‌నుష్, ప్రియాంక అరుల్‌ మోహన్‌ జంటగా న‌టిస్తున్న తాజాగా చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ అరుణ్‌ మాథేశ్వరన్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా మేక‌ర్స్ వరుస అప్‌డేట్‌లు ప్ర‌క‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ ‘కిల్లర్‌ కిల్లర్‌’ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్ వ‌చ్చింది.

క్రీనీడలే అంటూ సాగే రెండో పాట‌ను రేపు సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్రయూనిట్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్‌ స్పూర్తితో ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్‌ తెరకెక్కిస్తుంది.

ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్‌ తో పాటు సందీప్‌ కిషన్‌, నివేదితా సతీశ్‌, ఎడ్వర్డ్‌ సొన్నెన్‌బ్లిక్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!