HomeTelugu Trending'చావు కబురు చల్లగా' టీజర్‌

‘చావు కబురు చల్లగా’ టీజర్‌

Chaavu Kaburu Challaga te
టాలీవుడ్‌ యువ నటుడు కార్తికేయ – లావణ్య త్రిపాఠి నటిస్తున్న తాజా చిత్రం ”చావు కబురు చల్లగా”. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా పెగళ్ళపాటి కౌశిక్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ గ్లిమ్స్ ని మూవీయూనిట్ విడుదల చేసింది.

ఈ టీజర్‌లో కార్తికేయ చెప్పే ఫన్నీ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో కార్తికేయ స్వర్గపురి వాహనం నడిపే బస్తీ బాలరాజు పాత్రలో కనిపించనున్నాడు. లావణ్య త్రిపాఠి మల్లిక అనే నర్స్ పాత్ర పోషించింది. కార్తికేయ – లావణ్య లను చూస్తుంటే ఇద్దరూ డీ గ్లామరస్ పాత్రల్లో నటనకు ఆస్కారం ఉన్న రోల్స్‌లో నటించారని అర్థం అవుతోంది. మురళీ శర్మ, ఆమని,మహేష్, భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!