
తెలుగు స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో ప్రసారమవుతున్న టాక్ షో ‘సామ్ జామ్’కి యాంకర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్13న ఈ షో లాంఛనంగా ప్రారంభమవ్వగా సినీ సెలబ్రిటీలను తీసుకొచ్చి వారితో జనాలకు వినోదాన్ని పంచతున్నారు. మొదటి ఎపిసోడ్‌లో అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ సెలబ్రిటీగా వచ్చారు.
మున్ముందు ఎపిసోడ్‌లలో తమన్నా, రష్మిక మందన, సైనా నెహ్వాల్, కశ్యప్ పారుపల్లి, అల్లు అర్జున్ కూడా సమంత షోలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. సామ్‌జామ్‌లో ఓ ఎపిసోడ్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా రానున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాత బీఏ రాజు తన ట్విటర్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఎపిసోడ్ త్వరలోనే ఆహాలో ప్రసారం కానుంది. పూర్తిస్థాయిలో ఓ షోకు సమంత్ హోస్ట్‌గా చేయడం ఇదే తొలిసారి.
Pictures of MegaStar @KChiruTweets @Samanthaprabhu2 from #SamJam shoot pic.twitter.com/TmP9DWy5kG
— BARaju (@baraju_SuperHit) November 19, 2020













