HomeTelugu Trendingచిరంజీవి తో సుకుమార్‌ సినిమా!

చిరంజీవి తో సుకుమార్‌ సినిమా!

11 10
మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాల చేస్తూ.. బీజీగా ఉన్నాడు. ప్రస్తుతం కొరటాల శివతో చిరంజీవి చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు ఇతర దర్శకులు కూడా మెగాస్టార్ తో సినిమా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా మెగాస్టార్ సినిమాకు సంబంధించి ఒక వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. చిరంజీవి కొరటాల శివ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేస్తున్నారని తెలుస్తుంది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చెయ్యాలని చూస్తున్నారు. ఇప్పటికే ‘లూసిఫర్’ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ తీసుకున్నారు. ఈ సినిమాను చిరంజీవి హీరోగా నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నరట. ఈ సినిమా బాధ్యత సుకుమార్ కు అప్పగించారని తెలుస్తుంది. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం మెగాస్టార్ సినిమా పై దృష్టి పెట్టనున్నాడట సుకుమార్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!