కృష్ణని ఓదార్చిన కేసీఆర్‌

సీనియర్‌ నటి, ప్రముఖ దర్శకురాలు విజయ నిర్మల భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. తెలంగాణ భవన్‌ నుంచి నేరుగా నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌.. విజయ నిర్మల పార్థివదేహం వద్ద అంజలి ఘటించారు. ఆమె భౌతికకాయం పక్కనే విషణ్ణవదనంలో ఉన్న కృష్ణను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. నరేష్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విజయ నిర్మల హఠాన్మరణం పట్ల సంతాపం తెలిపిన కేసీఆర్‌.. సుమారు 20 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు ఎంపీలు కేకే, సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.