HomeTelugu Newsభారత్‌లో పెరుగుతోన్న కరోనా కేసులు

భారత్‌లో పెరుగుతోన్న కరోనా కేసులు

12 3
భారత్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 2573 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 83 కరోనాతో మంది మృతిచెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,836కి చేరింది. ఇప్పటి వరకు 1389 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11,762 మంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 12,974 మంది కరోనా బాధితులున్నారు. గుజరాత్ 5428, ఢిల్లీ 4549, తమిళనాడు 3023, మధ్యప్రదేశ్ 2942, రాజస్థాన్ 2886, యూపీ 2742 కరోనా బాధితులున్నారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1074 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 11,706 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో రికవరీ రేటు 27.52గా ఉన్నట్టు తెలిపింది.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. సోమవారం తాజాగా రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 3 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 1085కి చేరింది. ఇవాళ మరో 40 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 585కి చేరింది. కరోనా బారిన పడి తెలంగాణలో ఇప్పటి వరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 471 మంది ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 1650కి చేరింది. ఇప్పటి వరకు 524 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 33 మంది కరోనాతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 491
కరోనా బాధితులు ఉన్నారు. ఈ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గుంటూరులో 338, కృష్ణా 278, నెల్లూరు 91, కడప 87, చిత్తూరు 82, అనంతపురం 78, ప్రకాశం 61, ప.గో 59, తూ.గో 45, విశాఖ 35, శ్రీకాకుళంలో 5 కరోనా కేసులు నమోదయ్యాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu