‘పద్మావతి’కి ఊరట లభించింది!

ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు రానన్ని అభ్యంతరాలు, వ్యతిరేకత ‘పద్మావతి’ చిత్రానికి వచ్చింది. ఈ చిత్రంలో రాజ్ పూత్ లను అగౌరపరిచే విధంగా తెరకెక్కించారని కొన్ని వర్గాలు ఆందోళన చేపట్టాయి.  అంతే కాదు ఈ చిత్రం ఆపివేయాలని కర్ణిసేన సంఘాలు పలుమార్లు ధర్నాలు, నిరసనలు చేశారు. తాజాగా ఈ చిత్రంపై నిషేధం విధించాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మూడో సారి తిరస్కరించింది. 

గతంలో ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న పలు రాష్ట్రాల సిఎంలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాదు ఈ సినిమాపై సెన్సార్ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందని కోర్టు పేర్కొంది.  ప్రముఖ బాలీవుడ్ దర్శకులు సంజయ్ లీలా బన్సాలీ రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ‘పద్మావతి’ చిత్రాన్ని నిర్మించారు.