‘దేవదాస్’ తొలిరోజు వసూళ్లు!

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని కలిసి నటించిన మల్టీస్టారర్‌ మూవీ ‘దేవదాస్’. ఈ చిత్రం నిన్న (గురువారం) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక, ఆకాంక్ష సింగ్‌ హీరోయిన్‌లుగా నటించారు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వనిదత్‌ ఈ చిత్రాని నిర్మిచారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలో ఇద్దరు స్టార్‌ హీరోలు నటించడంతో తొలిరోజు వసూళ్లు మంచి స్థాయిలోనే ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా సినిమా 6.57 కోట్ల షేర్ రాబట్టింది. అత్యధికంగా నైజాం ఏరియాలో 1.68కోట్లు వసూలు చేసిన సినిమా సీడెడ్లో 73 లక్షలు, ఉత్తరాంధ్రలో 58 లక్షలు, గుంటూరులో 52 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 39 లక్షలు, వెస్ట్ గోదావరిలో 26 లక్షలు, కృష్ణాలో 32 లక్షలు, నెల్లూరులో 19 లక్షలు వసూలు చేసింది. ఇక శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో ఈ వసూళ్లు ఇలాగే కొనసాగే సూచనలున్నాయి.