కమల్ ఇంట్లో అగ్ని ప్రమాదం!

లోకనాయకుడు కమల్ హాసన్ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో కమల్ ఇంట్లోనే ఉన్నారు. అయితే విషయాన్ని గ్రహించిన కమల్ ఆయన సిబ్బంది వెంటనే బయటకు వచ్చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. శుక్రవారం రాత్రి కమల్ హాసన్ నివాసంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కమల్ ఆయన సామాజిక మాధ్యం ద్వారా వెల్లడించారు.
 
”ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. నేను మూడో అంతస్తు నుండి దూకి బయటపడ్డాను. నేను ఇప్పుడు సేఫ్ గా ఉన్నాను. నా సిబ్బందికి ధన్యవాదాలు. నా ఊపిరితిత్తులు మొత్తం పొగతో నిండిపోయాయి” అంటూ ట్వీట్ చేశారు కమల్ హాసన్. ఇటీవల శభాష్ నాయుడు సినిమా షూటింగ్ సమయంలో కమల్ కాలికి గాయం కావడంతో సినిమాలకు దూరంగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మరి కొద్ది రోజుల్లో కమల్ షూటింగ్ ప్రారంభించి సినిమాను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు.