HomeTelugu Big Storiesహీరోయిన్‌గా 'వల్లంకి పిట్ట' ఎంట్రీ..

హీరోయిన్‌గా ‘వల్లంకి పిట్ట’ ఎంట్రీ..

Gangotri movie child artistఇప్పటికే చాలా మంది బాలనటులు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. తాజాగా మరో చైల్డ్‌ ఆర్టిస్ట్‌ కూడా హీరోయిన్‌గా ఎంట్రీకి సిద్ధమౌతుంది. టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలిచిత్రం గంగోత్రిలో సినిమాలో ‘వల్లంకి పిట్ట..వల్లంకిపిట్ట’ని పాటలోని చిన్నారి పాప గుర్తుందా.. ఆ పాప పేర కావ్య. అక్షరాలా తెలుగు అమ్మాయి. ఈనెల 20వ తేదీ సోమవారం రోజు కావ్య పుట్టినరోజు. బాలు, అడవిరాముడు, అందమైన మనసులో, విజయేంద్రవర్మ మొదలైన సినిమాల్లో బాలనటిగా చేసింది ఈ అమ్మాయి. కలలు..ఆశయాలు నెరవేర్చుకునేలా సినిమా రంగంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆశిస్తుంది. ఇప్పుడు హీరోయిన్ కాబోతుంది. అంతకన్నా ముందు దాదాపు పదిహేనేళ్ళ నుంచి కూచిపూడి డాన్సర్. నాట్యంతో బాడీ లాంగ్వేజ్.. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుకున్నారు కావ్య. పూనెలో ఓ కాలేజిలో ‘లా’ పూర్తి చేసింది. చదువుపూర్తి చేసి సినిమా వైపు దృష్టి సారించింది. తెలుగుతో పాటు తమిళ..మళయాళ సినిమాలకు కూడా ఆడిషన్స్ చేస్తుంది కావ్య. ఆడిషన్స్ తో ప్రస్తుతం బిజీ బిజీగా ఉంటుంది కావ్య.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ … “లాక్ డౌన్ కి ముందుగానే ట్రయిల్స్ స్టార్ట్ చేశాను. ఇది రాకుండా ఉంటే ప్రాజెక్ట్ ఈ పాటికి ఖచ్చితంగా అనౌన్స్ అయి ఉండేది. గంగోత్రి అప్పుడు నాకు మూడు..నాలుగేళ్ళ వయసు ఉంటుంది. సినిమా గురించి అంత ఊహ తెలియదు. అలా 12సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. ఎదిగే కొద్దీ హీరోయిన్ కావాలనుకున్నాను. చదివితే ఇప్పుడే చదివెయ్యాలి. పూర్తి చేయాలి.. యాక్టింగ్ లోకి వచ్చి.. చదవలేక పోయానే అని బాధపడకూడదు. రెగ్యులర్ డాన్స్ ప్రాక్టీస్.. ఫిజిక్ మీద అవసరమైన శ్రద్ధ తీసుకున్నాను. సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ప్రతి సినిమా ఫాలో అవుతాను. తెలుగు చదువుతాను..మాట్లాడతాను. తెలుగు అమ్మాయిని కావడం అడ్వాంటేజ్ గా ఫీలవుతున్నాను. ఎందుకంటే మన తెలుగు కల్చర్..నేటివిటీ ఖచ్చితంగా హిందీ హీరోయిన్ల కన్నా తెలుగు అమ్మాయిలకే అర్థమవుతుంది. స్క్రిప్ట్ ని సులభంగా అర్థం చేసుకోగలం. ఆ పాత్రల బిహేవియర్స్ ఈజీగా పట్టుకోగలం. ఏ పాత్ర చేసినా ఆ ప్రాజెక్ట్ నాకు ఆర్టిస్ట్ గా ఉపయోగపడాలి. అలాగే నేనూ ప్రాజెక్ట్ కి ఉపయోగపడాలి. నాకు రియాలిటీకి దగ్గరగా ఉండేవి. ఇంట్రెస్టింగ్, ఛాలెంజింగ్ పాత్రలు ఇష్టం అని చెప్పింది

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!