HomeTelugu Trendingఏ మాయ చేసావే సీక్వెల్‌ రానుందా!

ఏ మాయ చేసావే సీక్వెల్‌ రానుందా!

1 28
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఏ మాయ చేసావే’. ఈ సినిమాతో నాగచైతన్య ప్రొఫిషనల్ లైఫ్ మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ కూడా మారిపోయింది. ఈ సినిమాతో పరిచయమైనా అందాల భామ సమంతానే ఆయన వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇన్నేళ్ల తరువాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని తెలుస్తుంది. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ అన్ని వర్గల ప్రేక్షకులను మెపించింది.

తమిళ్ లో శింబు హీరోగా ‘విన్నైతాండి వరువాయా’ పేరుతో ఈ సినిమా విడుదలయ్యింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి గౌతమ్ మీనన్ మాట్లాడుతూ .. తన వద్ద ‘విన్నైతాండి వరువాయా 2’ స్క్రిప్ట్ రెడీగా ఉందని – ఈ కథకు శింబు ఓకే అనాలే గానీ వెంటనే సెట్స్ పైకి తీసుకొస్తానని అన్నారు. దీంతో తమిళంలో ‘విన్నైతాండి వరువాయా 2’ సినిమా సెట్స్ మీదకు వస్తే తెలుగులో ‘ఏ మాయ చేశావే 2’ కూడా రూపొందనుందని అన్నారు. అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్త చేస్తున్నారు. పెళ్లితరువాత సమంత నాగచైతన్య కలిసి ఈ సినిమా చేస్తారని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!