HomeTelugu Trending'రన్‌ లోలా రన్‌' రీమేక్‌లో తాప్సీ

‘రన్‌ లోలా రన్‌’ రీమేక్‌లో తాప్సీ

3 17

టాలీవుడ్‌లో సినీ ప్రయాణం మొదలుపెట్టిన ముద్దుగుమ్మ తాప్సీ ఇక్కడ తన సత్తా చాటలేకపోయింది. బాలీవుడ్‌లో అదృష్టం కలిసొచ్చి రాణిస్తోంది. అక్కడ అడపాదడపా హిట్లు కొడుతూ వరుసగా సినిమా చాన్సులు కొట్టేస్తోంది. ఒకప్పుడు మామూలు హీరోయిన్‌గానే మనకి తెలుసు. కానీ బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత ఆమె ఇమేజ్ మారిపోయింది. వరుస విజయాలు ఆమెను బిజీ హీరోయిన్‌ని చేశాయి. తాప్సీ నటించిన ‘థప్పడ్‌’ ఈ నెలాఖరున విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె మిథాలీ రాజ్‌ బయోపిక్ ‘శభాష్ మిథూ’తో పాటు ‘రష్మీ రాకెట్’ అనే సినిమా కూడా చేస్తోంది. 1998లో ‘రన్‌ లోలా రన్‌’ జర్మన్‌ చిత్రం రిలీజ్‌ అయి హిట్‌ సాధించింది. ఇప్పుడు అదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాలో తాప్సీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్‌ నటుడు తాహీర్‌ రాజ్‌తో కలిసి నటిస్తోంది. వచ్చే ఏప్రిల్‌లో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని సోనీ
పిక్చర్స్‌ ఇండియా అండ్‌ ఎలిప్‌సిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పిస్తుంది. వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!