అమీర్ తన సత్తా చూపిస్తున్నాడు!

సంవత్సరం మొత్తంలో వచ్చిన సినిమాల రికార్డులను ఆఖరుగా తన సినిమాను రిలీజ్ చేసి మొత్తం రికార్డులను తిరగరాయడం అమీర్ ఖాన్ స్పెషాలిటీ. పీకే సినిమాతో ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్స్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు దంగల్ తో మరో రికార్డ్ సాధించాడు. రిలీజ్ ముందు నుండి సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. రిలీజ్ అయిన తరువాత కూడా తన హవాను సాగిస్తూ.. దూసుకెళ్తోంది.

విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటూ కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. కేవలం మూడే మూడు రోజుల్లో 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసెసింది. తొలిరోజు 29.78 కోట్లను వసూలు చేయగా.. రెండో రోజు 34.25 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు 42.35 కోట్లు మొత్తంగా చూసుకుంటే 106.95 కోట్లను వసూలు చేసింది. కేవలం మౌత్ టాక్ తో సినిమా దూసుకుపోతోంది. ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరిగి రాసేలా కనిపిస్తోంది!