HomeTelugu Big Storiesబాలయ్య పుట్టిన రోజు సందర్బంగా 'అఖండ' స్పెషల్‌ పోస్టర్‌

బాలయ్య పుట్టిన రోజు సందర్బంగా ‘అఖండ’ స్పెషల్‌ పోస్టర్‌

Akhanda new poster for bala

బోయపాటి డైరెక్షన్‌లో బాలయ్య నటిస్తున్న చిత్రం ‘అఖండ’. రేపు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి, స్పెషల్ పోస్టర్ గానీ .. ట్రైలర్ గాని .. సింగిల్ గాని రావొచ్చని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలారు. విజయోత్సవంతో ప్రజలంతా సంబరాలు జరుపుతూ ఉంటే, హీరో బాలకృష్ణ దర్జాగా నడుచుకుంటూ రావడం ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. ‘సింహా’ .. ‘లెజెండ్’ సినిమాల్లో మాదిరిగానే., ఈ సినిమాలోను బాలకృష్ణను బోయపాటి మరింత హ్యాండ్సమ్ గా చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

భారీ బడ్జెట్ తో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తూ ఉండగా, ఒక ముఖ్యమైన పాత్రలో పూర్ణ కనిపించనుంది. ఇక హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా చేస్తున్నాడు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు. విభిన్నమైన లుక్స్ తో బాలకృష్ణ కనిపించే ఈ సినిమాను, దసరా సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బాలకృష్ణ ఆ తరువాత సినిమాను గోపీచంద్ మలినేనితో చేయనున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu