తమిళ దర్శకుడితో గోపీచంద్‌!

టాలీవుడ్‌ హీరో గోపీచంద్ ప్రస్తుతం కొత్త దర్శకుడితో వర్క్ చేస్తున్నాడు. కాగా ఒక తమిళ దర్శకుడితో కూడ ఆయన సినిమా చేయనున్నాడు. ఆ దర్శకుడే తిరు. తమిళంలో నాలుగు సినిమాల వరకు డైరెక్ట్ చేసిన తిరు గోపీచంద్ కోసమే ఒక స్క్రిప్ట్య్ రెడీ చేసి ఆయనకు వినిపించాడట. ఆ స్క్రిప్ట్ నచ్చిన గోపీచంద్ వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించనున్నారు. సినిమా ఎప్పుడు మొదలవుతుంది, హీరోయిన్ ఎవరు వంటి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates