’24 కిస్సెస్’లో కిస్సెస్ పై ‘హెబ్బా’ ఏమందంటే

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ’24 కిస్సెస్’. ‘నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం’ అన్నది టాగ్ లైన్.. ‘మిణుగురులు’ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సిల్లీమొంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సంజయ్ రెడ్డి, అనిల్ పల్లెల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టిలు నిర్మించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా పై పలు విమర్శలు వస్తున్నాయి.

’24 కిస్సెస్’లో చాలా సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని చర్చ సాగుతున్న వేళ ఓ ప్రముఖ ఛానల్ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించగా, గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దేశంలో మీ టూ, కాస్టింగ్ కౌచ్ అంటు పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తున్నా మహిళలు. మరోవైపు యూత్ ని చెచ్చగొట్టే విధంగా చిత్రాలు తీయడం లిప్ లాక్ సీన్లు, బాత్ రూమ్, బెడ్ రూమ్ సీన్లు ఎంతో వల్గర్ గా చూపిస్తున్నారని ఆడియన్స్ ఆరోపిస్తున్నారు. ఈ సినిమాలో సీన్లు వల్గర్ గా ఉన్నాయని మీడియా జర్నలిస్ట్ క్వశ్చన్ చేశారు..దానికి అలాంటిది ఏమీ లేదని చిత్ర యూనిట్ సమాధానం చెప్పారు.

తాము నాలుగు గోడల మధ్య జరిగే సీన్లను, నాలుగు గోడల మధ్య జరిగినట్టుగానే చూపామని యూనిట్ వివరణ ఇచ్చింది. ఇదే విషయమై హెబ్బా పటేల్ స్పందిస్తూ.. ఈ చిత్రంలో కేవలం ముద్దు సీన్లను మాత్రమే హైలైట్ చేస్తున్నారని అది తప్ప తమ చిత్రంలో ఏ విషయం ఉండదా..అంటూ మీడియాపై చిందులేసింది. తాను ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోతున్నట్టు ప్రకటించి, వెళ్లిపోయింది. సినిమాలో కిస్ సీన్ ను వల్గర్ అనడం ‘పర్వర్షన్’ అని హీరో అదిత్ అరుణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.