HomeTelugu Trendingచిరంజీవి సినిమాలో నటించడం లేదంటూ త్రిష ట్వీట్

చిరంజీవి సినిమాలో నటించడం లేదంటూ త్రిష ట్వీట్

8 13
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి సైరా సమరసింహారెడ్డి సినిమా తర్వాత “ఆచార్య” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల అనంతరం షూటింగ్‌ ప్రారంభించారు. ఈ సినిమాలో చిరు సరసన త్రిషను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే తాను ఈ ప్రాజెక్టునుంచి తప్పుకుంటున్నట్టుగా ట్విట్టర్‌లో వెల్లడించింది. కొన్ని విషయాలు ముందుగా నిర్ణయించినట్టు కాకుండా విభిన్నంగా మారుతుంటాయి. చిత్ర యూనిట్‌కు నా అభినందనలు. ప్రస్తుతం చిరంజీవి సినిమానుంచి తప్పుకుంటున్నా.. మరో మంచి ప్రాజెక్టుతో తెలుగు ప్రేక్షకులను కలుసుకుంటా నంటూ ట్వీట్ చేసింది త్రిష.

గతంలో చిరంజీవి-త్రిష కలిసి స్టాలిన్ చిత్రంలో నటించారు. స్టాలిన్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. 14 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ రాబోతుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరోసారి ఈ జోడీని వెండితెరపై చూడబోతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. అయితే త్రిష అకస్మాత్తుగా ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో
అభిమానులు మండిపడుతున్నారు. త్రిష ఎందుకు తప్పుకుందో అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!