‘ఎన్టీఆర్’ 60 గెటప్‌ల్లో బాలయ్య!

నందమూరి తారకరామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’ చిత్రంలో బాలకృష్ణ లీడ్‌ రోల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సంబందించిన ప్రతి యొక్క పాత్రలను చూపడం జరుగుతుందట. అందుకోసం బాలయ్య ఒకటి కాదు రెండు 60 గెటప్స్ వేయనున్నాడట.

ఇక ఏఎన్నార్ పాత్రలో నటించనున్న సుమంత్ కూడ సుమారు 8 గెటప్స్ వేయనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విద్యా బాలన్, కైకాల సత్యనారాయణ, రానా దగ్గుబాటిలు నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కానుంది.