HomeTelugu Trendingకారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ హాలీవుడ్ హీరో

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ హాలీవుడ్ హీరో

1a
ప్రముఖ హాలీవుడ్ హీరో, హాస్యనటుడు కెవిన్ హార్ట్‌‌(40) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో ముల్హోల్యాండ్ రహదారిపై కెవిన్, అతని స్నేహితులు ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కెవిన్‌కు తీవ్ర గాయాలు కాగా, అతని స్నేహితులు బ్లాక్, ఇంటర్నెట్ ఫిట్నెస్ మోడల్, బ్లాక్‌ ఫియాన్సీ రెబెక్కా కూడా తీవ్రంగా గాయపడ్డారు. ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ పెట్స్‌ మూవీలో జుమాన్జీ పాత్రలో కెవిన్‌ నటించారు.

వాహనాన్ని నడుపుతున్న జేర్డ్‌ బ్యాక్‌(28) బ్లాక్‌ నియంత్రణ కోల్పోవడంతో వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా ఫెన్సింగ్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టి పక్కనే వున్న గోతిలోకి పడిపోయింది. దీంతో కెవిన్‌తోపాటు, బ్లాక్‌కు నడుము భాగంలో తీవ్రగాయాలయినట్టు సమాచారం. వెంటనే పెట్రోలింగ్ పోలీసులు హెలికాఫ్టర్ ద్వారా..హాస్పిటల్‌కు తరలించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు.

కాగా ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ పెట్స్‌ మూవీలో జుమాన్జీ పాత్రలో కెవిన్‌ మెప్పించారు. 2019 ఆస్కార్‌ పండుగకు కెవిన్‌ హోస్ట్‌గా వ్యవహరించాల్సి వుంది కానీ స్వలింగ సంపర్కానికి సంబంధించిన ఆయన పాత ట్వీట్లు వెలుగులోకి రావడంతో ఆయన్ను తప్పించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu