HomeTelugu Trendingనాగార్జున కొత్త సినిమా టైటిల్‌ వైరల్‌

నాగార్జున కొత్త సినిమా టైటిల్‌ వైరల్‌

interesting

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామి రంగ’. విజయ్ బిన్ని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నాగార్జున 99వ ప్రాజెక్టుగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పేందుకు రెడీ అవుతుందని టాక్‌.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో నాగార్జున తమిళ దర్శకుడు అనిల్‌తో ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. జ్ఞానవేళ్‌ రాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
తాజాగా ఈ చిత్రానికి టైటిల్‌ ఫిక్స్ చేశారన్న వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి ‘లవ్‌, యాక్షన్‌, రొమాంటిక్‌’ టైటిల్‌ పెట్టారట. ఈ క్రేజీ చిత్రంలో నాగ్‌ పక్కా యాక్షన్‌ ప్యాక్‌డ్‌ అవతార్‌లో కనిపించబోతున్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌. గ్రీన్‌ స్టూడియో నిర్మించనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu