HomeTelugu Newsఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ

12 3
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 26 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే మంగళవారం రాత్రి సచివాలయంలోని పలువురు కీలక ఐఏఎస్‌ అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం పలువురు ఎస్పీలు, డీఎస్పీలను బదిలీలు చేసేందుకు కసరత్తు చేసింది. ఐపీఎస్‌ల బదిలీపై ప్రాథమిక నివేదిక సిద్ధం చేసిన డీజీపీ గౌతం సవాంగ్‌ ఇవాళ ఉదయం తాడేపల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో 26 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు:
శ్రీకాకుళం-అమ్మిరెడ్డి
ప.గో- నవదీప్‌ సింగ్
కృష్ణా- రవీంద్రబాబు
గుంటూరు రూరల్-జయలక్ష్మి
చిత్తూరు- వెంకటప్పలనాయుడు
అనంత- సత్య ఏసుబాబు
విశాఖ డీసీపీ1- విక్రాంత్ పాటిల్
డీసీపీ2- ఉదయభాస్కర్‌
ఆక్టోపస్‌ ఎస్పీ- విశాల్‌ గున్ని
రైల్వే ఎస్పీ- కోయ ప్రసాద్‌
ఇంటెలిజెన్స్‌ ఎస్పీ- అశోక్‌కుమార్‌
సీఐడీ ఎస్పీ- సర్వశ్రేష్ట త్రిపాఠి
కర్నూలు డీఐజీ- టి.వెంకట్రామిరెడ్డి
ఏలూరు డీఐజీ-ఏఎస్‌ ఖాన్‌
సీఐడీ డీఐజీ- త్రివిక్రమ వర్మ
ఎస్‌ఐబీ ఎస్పీ-రవిప్రకాష్‌
గ్రేహౌండ్స్‌- రాహుల్‌దేవ్‌ శర్మ
రైల్వే ఎస్పీ- కోయ ప్రవీణ్‌
అనంతపురం పీటీసీ- ఘట్టమనేని శ్రీనివాస్‌
ఏఆర్‌ దామోదర్‌, భాస్కర్‌ భూషణ్‌, ఎస్వీ రాజశేఖర్‌బాబును హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu