ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు ఎవరంటే..?

నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకుడిగా తేజ వ్యవహరించనున్నారు. ఈ సినిమాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉండబోతుంది. ఈ పాత్రలో సీనియర్ నటుడు జగపతి బాబు కనిపించనున్నాడని టాక్. చంద్రబాబు పాత్రలో జగపతి అయితే బావుంటాడని భావించిన చిత్రబృందం ఆయనను సంప్రదించాలని చూస్తోంది.

అలానే హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్ నటించనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరిని ఫైనల్ చేసి అధికారికంగా వెల్లడించడానికి సిద్ధమవుతున్నారు. అయితే జగపతి, కల్యాణ్ రామ్ ల పేర్లు బయటకు వచ్చినప్పటి నుండి ఇద్దరూ కూడా ఆ పాత్రల్లో సరిగ్గా సరిపోతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.