HomeTelugu Trendingరాజశేఖర్‌ని ఫ్రాడ్‌ అని చెప్పిన జీవిత

రాజశేఖర్‌ని ఫ్రాడ్‌ అని చెప్పిన జీవిత

3 8టాలీవుడ్‌లో రాజశేఖర్, జీవితలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాదు.. హీరో రాజశేఖర్ ఏ నిర్ణయం తీసుకోవలన్నా.. జీవిత సలహాలు తప్పనిసరి అని పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు కూడా. తాజాగా ఓ షోలో.. జీవిత.. రాజశేఖర్‌ల గురించి పలు ఆసక్తికర నిజాలు బయటపెట్టారు. రాజశేఖర్‌ను.. జీవిత ఫ్రాడ్ అని పిలిచేవారట. అందుకు గల కారణంను కూడా ఆవిడ చెప్పారు.

జీవిత.. రాజశేఖర్‌ల మొదటి సినిమా ‘తలంబ్రాలు’. ఈ చిత్రం నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ కూడా పుట్టింది. ఈ సినిమాలో రాజశేఖర్ నెగిటీవ్ రోల్‌లో కనిపించారు. అందులో జీవిత.. రాజశేఖర్‌ను ఫ్రాడ్ అని పిలిచేదాన్ని అని చెప్పారు. ఇక అప్పటినుంచీ ఆ పిలుపు అలవాటైందని.. సెట్స్‌లో కూడా ఆయన్ని సరదాగా ఫ్రాడ్‌ అనే పిలిచానని తెలిపారు. కాగా.. ‘మగాడు’ సినిమా షూటింగ్‌ సమయంలో రాజశేఖర్‌కు ప్రమాదం జరగడంతో.. ఆస్పత్రిలో చేర్పించారు. ఆ టైంలో ఆయన తల్లిదండ్రులు కూడా ఊళ్లో లేరని.. సర్జరీ అయిపోయిన తర్వాత వచ్చారని.. అప్పటికే నేను ఆస్పత్రిలో ఉన్నాని చెప్పుకొచ్చారు.

ఆస్పత్రిలో కూడా నేను రాజశేఖర్‌ను ఫ్రాడ్.. ఫ్రాడ్ అని పిలవడంతో.. వాళ్ల అమ్మకు కోపం వచ్చి.. నన్ను పక్కకి పిలిచి.. ఫ్రాడ్ ఏంటి.. సరిగ్గా పిలువు.. నాకు నచ్చలేదని చెప్పినట్టు జీవిత అన్నారు. దీంతో అప్పటి నుంచి నేను రాజశేఖర్‌ను ఫ్రాడ్‌ అని పిలవడం మానేసి ‘బంగారం’ అని పిలుస్తానని చెప్పారు జీవిత రాజశేఖర్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!