అమెరికాలోనూ దూకుడు మీదున్న ‘జెర్సీ’

నేచురల్‌ స్టార్‌ నాని.. యంగ్‌ డైరెక్టర్‌ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా ‘జెర్సీ’. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. అమెరికాలో అయితే సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం రోజున 107,389 డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం మొత్తంగా 514,800 డాలర్లతో హాఫ్ మిలియన్ క్రాస్ చేసింది. ఇంకో మూడు రోజుల్లో చిత్రం మిలియన్ డాలర్ మార్కును తాకనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించింది.