Homeతెలుగు Newsఎన్టీఆర్‌ సినిమాలో కల్యాణ్‌రామ్‌ ఫస్ట్‌లుక్

ఎన్టీఆర్‌ సినిమాలో కల్యాణ్‌రామ్‌ ఫస్ట్‌లుక్

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “యన్‌.టి.ఆర్‌”. నందమూరి బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకుడు. ఎన్‌.బి.కే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. “కథానాయకుడు” “మహానాయకుడు”అనే టైటిల్స్‌ ఖరారు చేశారు. వచ్చే ఏడాది జనవరి 9న
మొదటి భాగం, జనవరి 24న రెండో భాగం విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

3a

 

విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమాలో ఎన్టీఆర్‌ కుమారుడు హరికృష్ణ పాత్ర పోషిస్తున్న కల్యాణ్‌రామ్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. “విజయం మీది.. విజయరథ సారథ్యం నాది.. నీడలా వెన్నంటి ఉంటా నాన్నగారూ..” అంటూ చిత్ర యూనిట్‌ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా “అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.. నాన్న పాత్రను పోషించడం గర్వంగా, భావోద్వేగంగా ఉంది” అని కల్యాణ్‌రామ్‌ ట్వీట్‌ చేశారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకంగా విద్యాబాలన్‌ నటిస్తున్నారు. చంద్రబాబు పాత్రలో రానా, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, నాగిరెడ్డిగా ప్రకాశ్‌రాజ్‌ నటిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి ఈ సినిమాకు బాణీలు అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!