మహర్షి సెట్స్‌లో దేవ్‌..!

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తున్న మహర్షి సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన లాంగ్ షెడ్యూల్ ను యూనిట్ ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్ తో సినిమాను కంప్లీట్ చేయాలని నిర్ణయించుకుంది. ఇదిలా ఉంటె, మహేశ్‌ బాబు షూటింగ్ లో ఉండగా అనేకమంది స్టార్ నటులు ఆయనను కలుస్తున్నారు. ఒక హీరో సినిమా సెట్స్ కు మరో హీరో రావడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నది.

మహేశ్‌ బాబును రీసెంట్ గా కన్నడ స్టార్ హీరో శ్రీమురళి కలిశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు తమిళ్ హీరో కార్తీ కూడా మహేష్ బాబు సెట్స్ లో కలిశారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. కార్తీ మహేష్ బాబును కలవడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటి..? ప్రమోషన్లో భాగంగా మహేష్ బాబును కలిశారా.. లేదంటే.. దేవ్ మూవీ ప్రమోషన్స్ చేయాలని మహేష్ ను కోరడానికి వచ్చారా అన్నది తెలియాలి. కార్తీకి వంశి పైడిపల్లితో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ఊపిరి సినిమాకు ఇద్దరు కలిసి పనిచేశారు. కార్తీ నటించిన దేవ్ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రేపు విడుదల కాబోతున్నది. టాలీవుడ్ లో కార్తీకి మంచి పేరున్న సంగతి తెలిసిందే. మరి దేవ్ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.