కాటమరాయుడు ఫస్ట్ డే కలెక్షన్స్!

భారీ అంచనాల మధ్య విడుదలైన కాటమరాయుడు చిత్రం తొలిరోజు భారీ వసూళ్లను సాధించింది. పవన్ అభిమానులను ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది ఈ సినిమా రిజల్ట్. విడుదలైన ప్రతి ఏరియాలో మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’ ఆ తరువాత బాహుబలి, శ్రీమంతుడు లిస్ట్ లో ఉన్నాయి. అయితే కాటమరాయుడు రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఖైదీ సినిమాకు మొదటి రోజు 23.28 కోట్లు షేర్ వస్తే.. కాటమరాయుడు తొలిరోజున 23.05 కోట్లు షేర్ రాబట్టాడు. నైజాంలో 4.77 కోట్లు..సీడెడ్ లో 2.98 కోట్లు, గుంటూరులో 2.97 కోట్లు, ఈస్ట్ 3.56 కోట్లు, వెస్ట్ 2.91 కోట్లు, ఉత్తరాంధ్ర 3.01కోట్లు,
కృష్ణా 2.52 కోట్లు, నెల్లూరులో 1.33 కోట్లను వసూలు చేసింది.