బిగ్‌బాస్‌ సెట్‌ ముందు కౌశల్‌ ఆర్మీ హల్‌చల్‌

తెలుగు బిగ్‌బాస్ రీయాల్టీ షో మరికొన్ని గంటల్లో ముగియనుంది. నేటి సాయంత్రం బిగ్‌బాస్‌ వేదికపై సంబరాలు జరగనున్నాయి. కేవలం ఈ రెండు రోజుల్లో ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లకే 2 కోట్లు రూ.. ఖర్చు చేసిననట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా ఇంటి సభ్యులను కూడా ఈ ఆఖరి ఘట్టానికి రెడీ చేసేందుకు స్పెషల్‌గా ప్రముఖ హెయిర్‌ స్టైలీస్ట్‌ లను బిగ్‌బాస్‌ ఏర్పాటు చేశాడు. అయితే ఇప్పుడు ఎక్కడ చూసిన విన్నర్‌ ఎవరు.. రన్నర్‌ ఎవరనే చర్చ వినిపిస్తుంది. అయితే కౌశల్‌కు మద్దతుగా నిలిచే కౌశల్‌ ఆర్మీ బిగ్‌బాస్‌ సెట్‌ ముందు హల్‌చల్‌ చేసినట్టు సమాచారం. హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఈ బిగ్‌బాస్‌ సెట్‌ ముందు శనివారం రాత్రి సుమారు మూడువందల మంది కౌశల్‌ ఆర్మీ సభ్యులు కౌశల్‌.. కౌశల్‌ అని అరుస్తూ హల్‌చల్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

దీంతో రాత్రి జరగాల్సిన ఫైనల్‌ షూట్‌ను బిగ్‌బాస్‌ నిర్వాహకులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో కౌశల్‌ ఆర్మీ సెట్‌ చుట్టూ అనేక పోస్టర్లు అంటించారు. భారీ బందోబస్తు మధ్య ఫైనల్‌ షూట్‌ను ఈ రోజు ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే కౌశలే బిగ్‌బాస్‌ సీజన్‌-2 విన్నర్‌గా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. కొంత మంది సెలబ్రిటీలు సైతం కౌశల్‌ విన్నర్‌ అయ్యాడని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. నటి మాధవిలత తన ఫేస్‌బుక్‌లో కౌశల్ ఆర్మీకి అభినందనలు.. కౌశలే విజేతగా నిలిచాడు అని పోస్ట్‌ చేశారు. ఆమెనే కాక చాలా మంది కౌశల్‌ విన్నర్‌ అయ్యారంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక కౌశల్‌ ఆర్మీ అయితే విన్నర్‌ కౌశలే కానీ రన్నరప్‌ ఎవరనీ పోస్టులు పెడుతోంది.