బెల్లంకొండ ‘కవచం’ ట్రైలర్‌

యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ నటిస్తున్న చిత్రం ‘కవచం’. ఈ చిత్రంలో కాజల్‌, మెహరీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీనివాస్‌ దర్శకుడు. వంశధార క్రియేషన్స్‌ పతాకంపై నవీన్‌ సొంటినేని నిర్మిస్తున్నారు. నీల్‌ నితిన్‌ ముఖేష్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తమన్ బాణీలు అందిస్తున్నారు. ‘అనగనగా ఓ రాజ్యం.. ఆ రాజ్యానికి రాజు లేడు. రాణి మాత్రమే.. ఆ రాణికి కవచంలా ఓ సైనికుడు’ అంటూ ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభించింది.

కాగా ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. యాక్షన్‌ సన్నివేశాలకు బాగా ప్రాముఖ్యం ఇచ్చి సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ‘ప్రతి ఆటలోనూ గెలుపు, ఓటమి అనేవి రెండుంటాయి. ఓటమి నీ తలరాతా కాదు.. గెలుపు ఇంకొకడి సొత్తూ కాదు. వాటి స్థానం మారడానికి అర సెకను చాలు’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. ‘పద్మవ్యూహంలో ఆగిపోవడానికి నేను అభిమన్యుడ్ని కాదు రా.. పోలీస్‌..’ అనే పవర్‌ఫుల్ ‌డైలాగ్‌ ఆకట్టుకుంది. డిసెంబరు 7న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.