భారీ రేటుకి ‘కేశవ’ నైజాం హక్కులు!

నిఖిల్ తాజా చిత్రం ‘కేశవ’ను అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ నామా రాజీపడకుండా నిర్మించడం, ‘స్వామి రారా’ వంటి హిట్ తర్వాత సుధీర్ వర్మ – నిఖిల్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో.. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నైజాం హక్కులను ప్రముఖ పంపిణీదారుడు ఏషియన్ ఎంటర్ ప్రైజెస్ సునీల్ నారంగ్ ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా..
అభిషేక్ నామా మాట్లాడుతూ.. “సునీల్ నారంగ్ తో పంపిణీదారుడిగా నా ప్రయాణం బాగా సాగింది. ఇద్దరం కలిసి హిట్ చిత్రాలు అందించాం. ఇప్పుడు నా సినిమాని ఆయన కొనడం ఆనందంగా ఉంది. ఇతర ఏరియాల నుంచి కూడా భారీ ఆఫర్లతో దాదాపు బిజినెస్ పూర్తయింది. మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే సరికొత్త కథతో తెరకెక్కుతోన్న సినిమా ఇది. నిఖిల్-సుధీర్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘స్వామి రారా’ ట్రెండ్ చేసినట్లుగానే ఈ ‘కేశవ’కూడా ట్రెండ్ సెట్ చేస్తుంది” అని చెప్పారు.