108 కోట్లు సాధించిన ‘ఖైదీ నెంబర్ 150’!

ఖైదీ నెంబర్ 150 సినిమా చిరంజీవి కెరీర్ లో ఓ మైలు రాయి చిత్రంగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఈ సినిమా ఇప్పుడు వంద కోట్లు సాధించిందని సమాచారం. జనవరి 11న విడుదలైన ఈ సినిమా నిన్నటితో వారం రోజులు పూర్తి చేసుకున్న
సంధర్భంగా చిత్ర దర్శకుడు వినాయక్, అల్లు అరవింద్ ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి సినిమా కలెక్షన్స్ గురించి వెల్లడించారు.

సినిమా మొదటి వారంలో అన్ని ఏరియాలు కలిపి మొత్తం 108.48 కోట్ల రూపాయలను వసూలు చేసినట్లు అల్లు అరవింద్ ప్రకటించారు. కేవలం ఏపీ, తెలంగాణలలో కలిపి మొత్తం 76 కోట్లు వసూలు చేయడం విశేషం. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన అభిమానులకు నేరుగా కృతజ్ఞతలు చెప్పడానికి చిత్రబృందం హైదరాబాద్ లో ఓ పెద్ద సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయనున్నారు.