HomeTelugu Trendingసంపూర్ణేష్‌బాబు.. 'కొబ్బరమట్ట' ట్రైలర్‌

సంపూర్ణేష్‌బాబు.. ‘కొబ్బరమట్ట’ ట్రైలర్‌

4 7బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు త్రిపాత్రాభినయం చేసిన సినిమా ‘కొబ్బరిమట్ట’. బుధవారం జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘పెదరాయుడు’, ‘పాపారాయుడు’, ‘ఆండ్రాయిడు’ గా సంపూను మూడు గెటప్‌లలో పరిచయం చేస్తున్న సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలైంది. సంపూ రౌడీలను చితకబాదుతూ.. ‘పిక్చర్‌ అభీ బాకీ హై మేరే పితాజీ’ అని చెప్పడం నవ్వులు పూయిస్తోంది. ఈ సినిమాకు రూప‌క్ రొనాల్డ్‌స‌న్ దర్శకత్వం వహించారు. ‘హృదయ కాలేయం’ ఫేం స్టీవెన్ శంక‌ర్ కథ, కథనం అందించారు. సాయి రాజేష్ నిర్మాత‌. అనేక సార్లు వాయిదాపడ్డ ఈ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 10న విడుదల కాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu