బాబాయ్ తరువాత అబ్బాయ్ తో!

ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో నందమూరి ఫ్యామిలీ హీరోస్ కు సంబంధించి ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఆ వార్తల సారాంశం ప్రకారం దర్శకుడు క్రిష్, జూనియర్ ఎన్టీఆర్ కోసం ఓ లైన్ ను రెడీ చేస్తున్నాడట. ప్రస్తుతం బాలకృష్ణతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని రూపొందిస్తోన్న దర్శకుడు క్రిష్ త్వరలోనే ఎన్టీఆర్ కు ఓ లైన్ వినిపించనున్నట్లు తెలుస్తోంది.

ఆ లైన్ గనుక ఎన్టీఆర్ కు నచ్చితే పూర్తి కథను సిద్ధం చేయాలనే ఆలోచనలో క్రిష్ ఉన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా పూర్తయ్యే లోపు క్రిష్ కూడా బాలీవుడ్ లో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.

ఆ తరువాత ఎన్టీఆర్ గనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి అటు బాబాయ్ తోనే కాదు.. ఇటు అబ్బాయ్ తో కూడా సినిమా చేసి తన సత్తాను చాటాలనుకుంటున్నాడు క్రిష్. తన ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో.. చూడాలి!