విలన్ అవతారంలో విక్రమ్!

కొత్తదనానికి, వైవిధ్యానికి కేరాఫ్ అడ్రెస్ విక్రమ్. తన ప్రతి సినిమా భిన్నంగా ఉండేలా చూసుకుంటాడు. కథా బలాన్ని మాత్రమే నమ్ముకొని సినిమా చేసే హీరో విక్రమ్. నిరంతరం కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి కొత్తదనం కోసమే ఈసారి విలన్ అవతారం ఎత్తబోతున్నారు.
ఇంకొక్కడు సినిమాలో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించిన విక్రమ్ కు ఆ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించాడు. ఇప్పుడు మరోసారి పూర్తి స్థాయి విలన్ గా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయనున్నారు.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తమిళ, మలయాళ బాషల్లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోగా నివిన్ పౌలి నటిస్తున్నారు. అలానే హీరోకు సమానంగా ఉండే ప్రతినాయకుడి పాత్ర కోసం విక్రమ్ ను ఎన్నుకున్నారు. తన పాత్ర వైవిధ్యంగా ఉండడం వలన విక్రమ్ వెంటనే అంగీకరించినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తారని సమాచారం.