సుశాంత్ ప్రేమలో కృతిసనన్..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలకు కొదవేమీ లేదు.. అందులోనూ.. బాలీవుడ్ లో మరిన్ని వార్తలు వినిపిస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ లో సుశాంత్ రాజ్ పుత్ తో నటి కృతిసనన్ ప్రేయలో ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలుగులో ‘1 నేనొక్కడినే’,’దోచేయ్’ సినిమాలు
చేసిన ఈ భామకు టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యి అక్కడ తన లక్ ను పరీక్షించుకొంది.

రీసెంట్ గా అమ్మడు సుశాంత్ తో ప్రేమలో పడినట్లు ఇద్దరు కలిసి న్యూఇయర్ వేడుకలను లండన్ లో జరుపుకున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. సుశాంత్ ‘ధోని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యాడు. మరి ఈ విషయంపై కృతి ఎలా రియాక్ట్ అవుతుందో.. చూడాలి!