మహేష్ అప్పుడైనా వస్తావా..?

మహేష్ బాబు-మురుగదాస్ సినిమా విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అసలు సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ఎప్పుడొస్తుందా..? అని అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ విషయంలో మేకర్స్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ఉగాదికి రిలీజ్ చేస్తారనుకుంటే అదీ జరగలేదు. స్వయంగా మహేష్ బాబు అభిమానులు కాస్త ఓపిక పట్టండి అంటూ ఓ ట్వీట్ పెట్టాడు. నిజానికి ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ రెడీగా ఉన్నాయంట. వీటిపై మహేష్ బాబు కూడా ఓ లుక్ ఏస్తే రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

ప్రస్తుతం మహేష్ వియత్నాంలో ఉన్నాడు. ఆయన ఈ మూడవ తేదీ హైదరాబాద్ రానున్నారు. రాగానే లుక్, టీజర్ పై ఫైనల్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. పోస్ట్ పోన్ చేస్తున్న కొద్దీ అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అందుకే వీలైనంత తొందరగా ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. దానికి ఏదైనా సంధర్భం ఉంటే మంచిదని శ్రీరామనవమిని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు స్పైడర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.