HomeTelugu Trendingనమ్రతకు మహేష్‌ బాబు స్పెషల్‌ పోస్ట్‌

నమ్రతకు మహేష్‌ బాబు స్పెషల్‌ పోస్ట్‌

3 9
టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు.. ఆయన సతీమణి నమ్రత చాల ఆన్యోనంగా ఉంటారు. మహేష్‌ చిన్న బ్రేక్‌ దొరికిన ఫ్యామీలితో గడపడానికి ఎక్కువ ప్రధాన్యత ఇస్తారు. నమ్రత కూడా భర్త పిల్లల విషయంలో చాలా కేరింగ్‌గా ఉంటూ.. ప్రతీ విషయంలో భర్తకు చేదోడువాదోడుగా నిలుస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో మహేష్ కూడా ఒప్పుకున్నారు. తనకు సంబంధించిన విషయాలన్నీ నమ్రతానే స్వయంగా చూసుకుంటుందని చెప్పారు మహేష్. అయితే తన భార్యపై తనకున్న ప్రేమను కూడా అనేక సందర్భాల్లో చాటుకున్నాడు మహేష్‌.

తన కుటుంబానికి సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక మహేష్ చెప్పేది ఏ చిన్న వార్త అయినా సరే… అతని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అయితే తాజాగా … మహేష్.. తన భార్య నమ్రతతో దిగిన ఓ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఆ ఫోటోలో నమ్రత మమేష్‌ను వెనుక నుంచి గట్టిగా హత్తుకొని కనిపిస్తుంటే… మహేష్ మొహంలో నవ్వులు పుస్తున్నాయి. దీనికి ఓ క్యాప్షన్ కూడా పెట్టాడు. అయితే విషయం ఏంటంటే ఇవాళ మహేష్ నమ్రతల పెళ్లి రోజు. అందుకే… ‘హ్యాపీ 15 మై లవ్… ప్రతీ రోజు కొంచెం ఎక్కువగానే నిన్ను ప్రేమిస్తుంటా’ అంటూ ట్వీట్ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!