HomeTelugu Trendingకార్తీ డైరెక్టర్‌తో మహేష్‌ సినిమా..

కార్తీ డైరెక్టర్‌తో మహేష్‌ సినిమా..

Mahesh movie with lokesh kaసూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్‌లతో దూసుకుపోతున్నారు. తాజాగా పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇక దర్శకధీరుడు రాజమౌళి తో మహేష్ త్వరలో ఓ సినిమా చేయబోతున్నాడు. కాగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బీజీగా ఉన్నాడు. ఈ సినిమా పూరై మహేష్ సినిమా సెట్స్ పైకి వెళ్లేసరికి చాలా సమయం పట్టేలా ఉంది. ఈ గ్యాప్‌లో మహేష్ ఈ గ్యాప్ లో ‘సర్కారు వారి పాట’ తో పాటు మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ”ఖైదీ” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ తో సినిమా చేయడానికి మహేష్ సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu