నాని ‘దారే లేదా’ వీడియోపై మహేష్‌ ప్రశంసలు


నేచురల్ స్టార్ నాని మరియు అతని టీమ్‌ చేసిన ‘దారే లేదా’ వీడియోపై టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ట్విట్టర్‌ వేదికగా ప్రశంసలు చేశారు. ఈ వీడియో చూసి నా మనసు పులకరించిందని తెలిపారు. కరోనా సంక్లిష్ట పరిస్థితుల్లో తమ జీవితాలను పణంగా పెట్టడంతో పాటు, తమ కుటుంబసభ్యుల జీవితాలను కూడా రిస్క్‌లో పెట్టి కోవిడ్‌ బాధితులకు అద్భుతంగా సేవలు అందించి, చాలామంది ప్రజల జీవితాలను కాపాడిన కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు అంకితమిచ్చేందుకు ఈ ‘దారే లేదా’ పాటను నాని రూపొందించారు. ఈ పాటకు మంచి స్పందన వస్తుంది. తాజాగా ఈ వీడియోపై మహేష్‌ బాబు కూడా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

”మన ఫ్రంట్‌లైన్ కార్మికులను గౌరవించేందుకు మంచిదారిని ఎన్నుకున్నారు. నిండు హృదయంతో చేసిన ఈ వీడియో చూసి.. నా హృదయం కూడా సంతోషంతో నిండిపోయింది. నాని మరియు అతని టీమ్‌ అద్బుతమైన పనితనాన్ని ప్రదర్శించారు..” అని సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు ట్విట్టర్‌ ద్వారా తెలుపుతూ.. ఈ ‘దారే లేదా’ పాటను షేర్‌ చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates