HomeTelugu Big Storiesతెలుగు బిగ్‌బాస్-4 హోస్ట్‌గా సూపర్ స్టార్..?

తెలుగు బిగ్‌బాస్-4 హోస్ట్‌గా సూపర్ స్టార్..?

5 12
అన్ని భాషల్లో సూపర్ హిట్ కొట్టిన రియాల్టీ షో బిగ్‌బాస్. తెలుగు, తమిళం‌, హిందీ, కన్నడం, మలయాళం.. ఇలా అన్ని భాషల్లోనూ తనదైన సత్తా చూపిస్తోంది. హిందీలో 13 సీజన్‌లు పూర్తిచేసుకుంది ఈ రియాల్టీషో. తెలుగులో 3 సీజన్లు పూర్తిచేసుకుని 4వ సీజన్‌కు సిద్ధమౌతుంది. తొలి సీజన్ సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. దీనికి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా అదరగొట్టేశాడు. ఆ తర్వాత బిగ్‌బాస్‌ రెండో సీజన్ నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. అనేక కాంట్రవర్సీలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక మూడో సీజన్‌లో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా వచ్చి షోను మరింత రసవత్తరంగా మలిచాడు. దీంతో టీఆర్‌పీ రేటింగ్‌ అమాంతం పెరిగి నెంబర్‌ వన్‌ రియాల్టీ షోగా పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్‌కు సిద్ధమవుతుండగా హోస్ట్‌ ఎవరనేదానిపై ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

జూనియర్ ఎన్టీఆర్‌ను మరోసారి హోస్ట్‌గా చేయాలని బిగ్‌బాస్ నిర్మాతలు కోరినట్లు సమాచారం. అయితే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల ఇందుకు తారక్‌ నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబును సంప్రదించినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బుల్లితెరపై కనిపించడానికి ఈ సూపర్‌ స్టార్‌ ఆస​క్తిని కనబరుస్తున్నారు. బిగ్‌బాస్‌ వ్యాఖ్యాతగా అలరించేందుకు మహేష్‌ సన్నద్ధమవుతున్నట్లు, అందులో భాగంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై నిర్మాతలు ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటనా చేయలేదు. గత సీజన్ల కంటే సీజన్‌4 భిన్నంగా ఉంటుందని మాత్రం తెలుస్తోంది. ఇప్పటికే బిగ్‌బాస్‌ 3ని, బిగ్‌బాస్‌ 2కు జిరాక్స్‌ కాపీగా మలిచారన్న విమర్శలు రావడంతో ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు పడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!