HomeTelugu Trendingకామెంట్లపై మంచు లక్ష్మి ఫైర్‌

కామెంట్లపై మంచు లక్ష్మి ఫైర్‌

Manchu Lakshmi fires on net
తన సోదరుడు మంచు విష్ణుపై నటి మంచు లక్ష్మి చేసిన ఓ ట్వీట్‌పై పలువురు కామెంట్లు చేస్తున్నారు. వీటిపై తాజాగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో విజయం సాధించి ‘మా’ నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షుడిగా తన సోదరుడు ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకోవాలని ఆశిస్తూ లక్ష్మి అదేరోజు ట్వీట్‌ చేశారు.

‘ఈరోజు మా కుటుంబానికి అత్యంత శుభదినం!! నా సోదరుడు విష్ణు.. ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం. ప్రపంచాన్ని మార్చడానికి ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించనున్న కొత్త ప్రయాణానికి ఆల్‌ ది బెస్ట్‌. నాకెంతో గర్వంగా ఉంది. నువ్వు ఎలాంటి మార్పులు చేయనున్నావోనని చూస్తున్నాను’ అని మంచు లక్ష్మి మొదట ట్వీట్‌ చేశారు. అయితే, ఆమె ట్వీట్‌పై నెటిజన్లు పంచులు వేయడం ప్రారంభించారు. ‘మా’ అధ్యక్షుడు మొత్తం ప్రపంచాన్ని ఎలా మార్చగలడు?’ అంటూ వరుస పంచులు వేశారు.

కాగా, తాజాగా నెటిజన్ల కామెంట్లపై లక్ష్మి ఫైర్‌ అయ్యారు. ‘ఇక ఆపండి!! ఎప్పుడు ఛాన్స్‌ వస్తుందా.. ఎవర్ని కామెంట్‌ చేద్దామా.. అని చూస్తుంటారు. నటీనటులకు సినిమానే ఓ ప్రపంచం. కాబట్టి, నా ఉద్దేశం ప్రకారం మీరు అనుకునేలా ప్రపంచాన్ని మార్చడం కాదు.. మా అసోసియేషన్‌ ప్రపంచాన్ని మార్చడం.. ఈ విషయాన్ని కొంచెం అర్థం చేసుకోండి’ అని ఆమె క్లారిటీ ఇచ్చారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!