మోడీ ప్రామిస్‌ను గుర్తు చేసిన మంచు మనోజ్


మోహన్‌ బాబు తనయుడు హీరో మంచు మనోజ్ సినిమాల నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్నా రాజకీయపరమైన విషయాలపై ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు. ఈమధ్యే సామాజిక సేవలోకి దిగుతున్నట్టు ప్రకటన చేసిన ఆయన తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మోడీని డిమాండ్ చేశారు.

మోడీగారు మీకు అవసరమైనప్పుడు మేము అండగా నిలిచాం. ఇపుడు మీ హామీలను మీరు నెరవేర్చాలి. మా డిమాండ్లను గౌరవించి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి. లేదా మీరు ఒట్టు పెట్టిన వేంకటేశ్వరస్వామి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది అంటూ ఆనాడు మోడీ తిరుపతి బహిరంగ సభలో ఇచ్చిన హోదా హామీని గుర్తుచేశారు.