అక్కినేని నాగార్జున.. కె విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మన్మధుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగులు థియేటర్లో పేలాయి. 2002 డిసెంబర్ 20 వ తేదీన ఈ సినిమా విడుదల అయింది. దాదాపు 17 సంవత్సరాల తరువాత.. ఈ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నారు.
దీనిని సంబంధించిన వార్తలు చాలా రోజుల నుంచి చక్కెర్లుకొడుతున్నాయి. చిలసౌ వంటి మంచి విజయాన్ని ఇచ్చిన రాహుల్ రవీంద్రన్ ‘మన్మధుడు 2’ సినిమాను తెరకెక్కించబోతున్నారని, కథ కూడా లాక్ చేశారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజమే అని తాజా సమాచారం బట్టి తెలుస్తోంది.
మార్చి 12 వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయబోతున్నారని తెలుస్తోంది. రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలు అవుతుందనే విషయాలను త్వరలోనే ప్రకటిస్తారట. నాగార్జునతో పాటు ఎవరెవరు సినిమాలో చేస్తారనే విషయాలను కూడా చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటిస్తుంది.